
స్పష్టం చేసిన నారా చంద్ర బాబు నాయుడు
అమరావతి : స్వచ్ఛ ఆంధ్ర ప్రచారాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. జిల్లా కలెక్టర్లతో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖలపై సమీక్ష చేపట్టారు. ప్రధానంగా క్లీన్ అండ్ గ్రీన్ అనేది ముఖ్యమన్నారు. ఎక్కడా చెత్త చెదారం కనిపించ కూడదని స్పష్టం చేశారు. దీనిపై ఎక్కువగా ఆయా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. జనవరి నుండి ఎటువంటి వ్యర్థాలు కనిపించకుండా చూసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రచార రీతిలో కొనసాగించాలన్నారు. వ్యర్థాలు ఎక్కడా కనిపించకూడదని పేర్కొన్నారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ప్రారంభించిన ఏ కార్యక్రమాన్ని అయినా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీ విధానాలు ప్రారంభించబడ్డాయని పేర్కొంటూ, ఐదు జోన్లలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏర్పాటు చేస్తామని సిఎం చెప్పారు. ఇంకా, వివిధ ప్రభుత్వ సేవలకు రేటింగ్‌లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2 నాటికి 86 లక్షల టన్నుల పాత వ్యర్థాల తొలగింపు ద్వారా వారసత్వ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చొరవను ప్రారంభించిందన్నారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. డిసెంబర్ నాటికి మరో 30 లక్షల టన్నుల చెత్త తొలగింపు జరుగుతుందని ఆయన చెప్పారు.