అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో

తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు.

సాయంత్రం శ్రీవారిని తిరుచ్చి పైకి వేంచేపు చేసి సమర్పణ చేపట్టారు. అనంతరం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాల అనంతరం పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.

18వ తేదీ గురువారం స్వామి వారికి పవిత్ర సమర్పణ చేపడుతారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం చేపడుతారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

19వ తేదీ గురువారం ఉదయం ఏకాంతంగా శ్రీవారికి, శ్రీ పద్మావతీ అమ్మ వారికి, శ్రీ ఆండాళ్ అమ్మ వారికి అభిషేకం చేస్తారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల తర్వాత స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం శ్రీవారి తిరువీధి ఉత్సవం, రాత్రికి పలు వైదిక కార్యక్రమాల అనంతరం పూర్ణాహుతి, కుంభబింభం వేంచేపు, కళవాహన విశేష నివేదన, అర్చక బహుమానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, సూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు, అర్చకుల, భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

    వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల ఆల‌య ప‌రిధిలోని ఆల‌యాల‌లో అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించే ఉత్స‌వాల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇందులో భాగంగా అక్టోబర్…

    అంగ‌రంగ వైభ‌వంగా ప‌విత్రోత్స‌వాలు

    శ్రీ‌ప‌ట్టాభిరామ స్వామివారి ఆల‌యంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *