
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి
విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. అమ్మ వారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 4,500 మందితో పోలీసులతో బధ్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వెయ్యి కి పైగా సిసి కెమేరాలతో పాటు ఐదు డ్రోన్లతో దసరా ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు అనిత. భవానీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ ఉత్సవ్ పై అమ్మవారి కరుణ ఉందని చెప్పారు.
అమ్మతో ఎవరూ పెట్టుకోకూడదని మంత్రి హితవు పలికారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని దొంగ ఆఫిడవిట్లు వేశారని ఆరోపించారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కేసులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కోరారు వంగలపూడి అనిత. దసరా ఉత్సవాలపైన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని హితవు పలికారు. ఏ సమాచారాన్నైనా అధికారుల నుంచి అడిగి తెలుసు కోవాలని సూచించారు. ఆ 11 మంది అసెంబ్లీకి రారంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే అవ్వాలని ఒక కల అని, అది ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, ఇంద్రకీలాద్రి అమ్మ వారి ఆశీస్సులతో శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యానని చెప్పారు వంగలపూడి అనిత.
జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. 5 కోట్ల మంది తో ఆ 11 మందికే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని జగన్ రెడ్డికి, ఆయన పరివారానికి సూచించారు మంత్రి.