361 మందిని ర‌క్షించిన నారా లోకేష్

నేపాల్, మాన‌స స‌రోవ‌ర్ లో బాధితులు

అమ‌రావ‌తి : మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌నంగా మారారు. నేపాల్ తో పాటు మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌కు వెళ్లి చిక్కుకు పోయారు ఏపీకి చెందిన తెలుగు వారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే లోకేష్ రేయింబ‌వ‌ళ్లు నిద్ర‌హారాలు మాని వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారు 275 మంది తెలుగు వారిని ఇప్ప‌టికే రక్షించారు. వారంతా ప్రత్యేక విమానాల‌లో త‌ర‌లించారు. వీరంతా వారి వారి స్వ‌స్థ‌లాల‌కు పంపించ‌డంలో కీల‌క పాత్ర పోషించాచ‌రు. మ‌రో వైపు మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌లో చిక్కుకున్న 86 మందిని ఇవాళ తీసుకు వ‌స్తున్నారు. వీరంతా ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. వీరంతా ఢిల్లీ మీదుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. దీంతో మొత్తం 361 మంది ఏపీ వాసులను రక్షించి వారివారి స్వస్థలాలకు చేర్చినట్లు అయింది. నేపాల్ లో ఇక ఎవరూ ఏపీ వాసులు లేక పోవడంతో ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ను అధికారులు మూసి వేస్తున్నారు.

తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకు రావడమే ఏకైక అజెండాగా పని చేశారు మంత్రి నారా లోకేష్.
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటుచేసి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి రెండు గంటలకోసారి తెలుగువారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వీడియో కాల్ ద్వారా బాధితులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. ఉంటున్న ప్రదేశం నుంచి ఎవరూ బయటకు రావొద్దని పదేపదే విజ్ఞప్తి చేశారు. వారిని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిది అంటూ భరోసా ఇచ్చారు. ప్రత్యేక విమానాల ద్వారా విశాఖ, తిరుపతి విమనాశ్రయాలకు చేరుకున్న రాష్ట్ర వాసులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించారు.

దీంతో రాష్ట్రానికి చేరుకున్న తెలుగు వారిని ఆయా విమానాశ్రయాలకు వెళ్లి కూటమి ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వాహనాల ద్వారా వారిని స్వస్థలాలకు చేర్చారు. చివరి తెలుగు వ్యక్తిని రాష్ట్రానికి తీసుకువచ్చేంత వరకు కంట్రోల్ రూమ్ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకుంటూ నేపాల్ నుంచి మొత్తం 361 మంది ఏపీ వాసులను రక్షించి రాష్ట్రానికి చేర్చారు. తెలుగు వారిని కాపాడేందుకు మంత్రి నారా లోకేష్ చేసిన కృషి పట్ల నేపాల్ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన ఏపీవాసులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *