ఆస్కార్ బ‌రిలో జాన్వీ క‌పూర్ సినిమా

భార‌త దేశం నుంచి ఏకైక చిత్రం ఎంపిక

ముంబై : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ముఖ్య భూమిక పాత్ర పోషించిన చిత్రం హోమ్ బౌండ్ . త‌న న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. భారత దేశం నుంచి ఏకైక సినిమాగా ఆస్కార్ 2026 అవార్డు రేసులో నిలిచింది. ఈ విష‌యాన్ని జ్యూరీ చైర్ ప‌ర్స‌న్ చంద్ర‌. ఏక‌గ్రీవంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు సింగ‌పూర్ వేదిక‌గా. ఇదిలా ఉండ‌గా హోమ్ బౌండ్ చిత్రం ఎంపిక కావ‌డంపై స్పందించారు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా 98వ అకాడ‌మీ పుర‌స్కారాల‌కు ఇండియా త‌ర‌పున సెలెక్టు కావ‌డం ప‌ట్ల స్పందించారు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు ఫిర్దౌసుల్ హ‌సన్. 14 మంది స‌భ్యుల‌తో కూడిన జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది మామూలు విష‌యం కాద‌న్నారు.

ఆస్కార్ 2026 అవార్డుల ఎంట్రీకి సంబంధించి జ్యూరీ ప‌రిశీల‌న నిమిత్తం మొత్తం 24 సినిమాలు అందాయి. వీటిని ప‌రిశీలించి విస్తృతంగా చ‌ర్చించారు. చివ‌ర‌కు జాన్వీ క‌పూర్ కీ రోల్ పోషించిన హోమ్ బౌండ్ ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపారు హ‌స‌న్. ఈ ఒక్క సినిమానే ఆస్కార్ అవార్డుకు అర్హ‌త సాధిస్తుంద‌ని ఎంపిక క‌మిటీ భావించింద‌న్నారు. సినిమాలో కంటెంట్ అద్భుతంగా ఉంద‌న్నారు. హౌమ్ బౌండ్ అనేక అంత‌ర్జాతీయ అవార్డుల‌ను అందుకుంది. ఈ చిత్రం భార‌తీయ‌త‌ను, స‌మాజ‌పు పోక‌డ‌ను, ఇక్క‌డి జీవితాన్ని అద్భుతంగా ఆవిష్క‌రించింది. సాంకేతికతతో పాటు నటన, ఎడిటింగ్, సంగీతం, కంటెంట్ ఇతర విషయాలన్నీ కూడా హౌమ్ బౌండ్ లో కావాల్సిన‌న్ని ఉన్నాయ‌ని పేర్కొన్నారు హ‌స‌న్.

  • Related Posts

    ఇక నుంచి సినిమాల‌పైనే ఫోక‌స్ పెడ‌తా

    న‌టుడు రాహుల్ రామ‌క్రిష్ణ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : న‌టుడు, ర‌చ‌యిత రాహుల్ రామ‌కృష్ణ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాడు. త‌ను తాజాగా ఎక్స్ వేదిక‌గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరుపై వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు క‌ల‌క‌లం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున…

    బాహుబ‌లికి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న జ‌క్క‌న్న

    రీ రిలీజ్ కు రెడీ చేస్తున్న మూవీ నిర్మాత‌లు హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌ను రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బాహుబలి ఇండియాతో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్ర‌స్తుతం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *