
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కామెంట్
అమరావతి : ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల నికర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రైతులు యూరియాను మోతాదుకు మించి వినియోగిస్తున్నారని, వాటిని తగ్గించాలని సూచించారు. ఎరువుల వినియోగం తగ్గిస్తే ప్రధానమంత్రి ప్రణామ్ కింద నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిందని ఈ సందర్భంగా వెల్లడించారు. దీని కింద ఇచ్చే నిధులను రైతులకు చెల్లిస్తామని చెప్పారు సీఎం . ఏపీ రాష్ట్ర చరిత్రలో తొలిసారి హెక్టారు ఉల్లికి రూ.50 వేలు ఇస్తున్నామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
సోమవారం జరిగిన శాసన సభలో ప్రసంగించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే దీనిని తప్పకుండా వాడాలని సూచించారు. రైతులు బాగుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారేంత వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం. ఫుడ్ ప్రాసెసింగ్ పైనా ప్రధానంగా దృష్టి పెట్టాం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా గరిష్టంగా ఆదాయం సాధించే అవకాశం ఉందన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పారు.