సిరిసిల్ల క‌లెక్ట‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోండి : హైకోర్టు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ధ‌ర్మాస‌నం

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. బాధితుడికి న‌ష్ట ప‌రిహారం చెల్లించే విష‌యంలో సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల మండిప‌డింది. ఇదే స‌మ‌యంలో వివ‌ర‌ణ ఇవ్వ‌క పోవ‌డంపై మండిప‌డింది. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతే కాదు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నియమించిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ సర్కార్ జూన్ 2024 లో సిరిసిల్ల కలెక్టర్‌గా ఝాను నియమించింది మొదలు. తప్పుడు కేసులు, అనవసర వివాదాలు, ప్రోటోకాల్ ఉల్లంఘన వంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా వ్యవహరిస్తున్నాడని భారీ అపప్రద మూట గట్టుకున్నాడు.. అతనిపై పలు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. కేటీఆర్ పేరు మీద టీ స్టాల్ పెట్టుకున్న ఒక చిరు వ్యాపారిపై జులుం ప్రదర్శించి, రాత్రికి రాత్రే ఆ టీ స్టాల్‌ను ఝా తీసేయించాడు. అనేకమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించాడు.

ఇక గ్యాగ్ ఆర్డర్ విషయంలో జోక్యం చేసుకున్న ఉన్నత న్యాయస్థానం, ఆ ఆర్డర్‌ను కొట్టేసింది. మిడ్ మానేరు భూ నిర్వాసితురాలికి సంబంధించిన ఒక కేసు విషయంలో కోర్టు ఆదేశాలు పాటించనందుకు ఇప్పటికే ఝాను హైకోర్టు పలుమార్లు మందలించింది. కలెక్టర్ అధికార దుర్వినియోగం ఎక్కువై పోవడంతో అతని ప్రవర్తనను న్యాయస్థానం కూడా తీవ్రంగా పరిగణించి చర్యలకు ఆదేశించింది.

  • Related Posts

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *