923 ఎక‌రాల‌ను క‌బ్జా నుంచి ర‌క్షించాం

స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : హైడ్రాపై ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఇప్ప‌టి వ‌ర‌కు తాను వ‌చ్చాక హైద‌రాబాద్ లో క‌బ్జాల‌కు గురైన ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 923.14 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడామ‌ని చెప్పారు. దీని విలువ రూ. 50 వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా అని పేర్కొన్నారు. గాజుల రామారం, ప్ర‌గ‌తిన‌గ‌ర్ మ‌ధ్య‌న 317 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడినట్లు తెలిపారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేష‌న్‌కు చెందిన ఈ భూమి క‌బ్జాల‌కు గురౌతుంటే స్థానికుల ఫిర్యాదుమేర‌కు విచార‌ణ జ‌రిపి క‌బ్జాల‌ను తొల‌గించ‌డం జ‌రిగింద‌న్నారు. మొత్తంగా 581 ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించామ‌న్నారు. ఇందులో బ‌డాబాబుల క‌బ్జాలే ఎక్కువ‌గా ఉన్నాయని చెప్పారు క‌మిష‌న‌ర్. గండిపేట‌లో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల రిసార్టులు, ప్లే ఏరియాలు తొల‌గించామ‌ని స్ప‌ష్టం చేశారు రంగ‌నాథ్.

మూసీ న‌ది ప్ర‌వాహంపై ప్ర‌భావం ప‌డే విధంగా ఉన్న ఆక్ర‌మ‌ణ‌లు భారీ మొంత్తంలో తొల‌గించిన‌ట్లు పేర్కొన్నారు. ఇందులో ప్ర‌భుత్వ భూములు 424 ఎక‌రాలు కాగా నాలాలు, ర‌హ‌దారులు, పార్కులు, చెరువులు, అనుమ‌తులు లేని నిర్మాణాలు వెలిసిన చోట తొల‌గించిన ఆక్ర‌మ‌ణ‌లు క‌లిపితే మొత్తం 923.14 ఎక‌రాల భూమిని కాపాడామ‌ని చెప్పారు. హైడ్రా చేసిన ప‌నులు ఇప్పుడు తెలియని కొన్ని రోజుల త‌ర్వాత తెలుస్తుంద‌న్నారు. న‌గ‌రంలోని గొలుసుక‌ట్టు చెరువుల‌ను పున‌రుద్ధ‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా హైడ్రా ప‌నిచేస్తోంద‌ని అన్నారు. వ‌ర‌ద కాలువ‌లు 10 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఉన్న‌వి కేవ‌లం 1 నుంచి 2 మీట‌ర్ల‌కు ప‌రిమితం అవుతున్నాయ‌ని ఆవేద‌న చెందారు. వీటిని విస్త‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

  • Related Posts

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *