
శాసన సభలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి : ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు . బుధవారం శాసనసభలో చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్-2025 కు ఆమోదం తెలపడం పట్ల సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆక్వా రంగాన్ని జోన్, నాన్ జోన్ గా విభజించి అభివృద్ధిపై దృష్టి పెట్టారని అన్నారు. ఆక్వా రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రర్ అవ్వాలని కోరారు, రిజిష్ట్రర్ అయిన రైతులకు మాత్రమే సబ్సిడీ విద్యుత్ యూనిట్ కు రూ. 1.50 వర్తిస్తుందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆక్వా పంటలకు జీయో ట్యాగ్ చేసి చెరువులను గుర్తిస్తున్నాం అన్నారు.
ముమ్మడివరం, తాడేపల్లి గూడెం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలోని ఆక్వా రైతులకు సబ్సిడీలో 64,500 విద్యుత్ కలెక్షన్స్ ఇవ్వొచ్చు అన్నారు. ఇప్పటికి 50,000 విద్యుత్ కలెక్షన్స్ ఇచ్చామని తెలిపారు. ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకొని ఆక్వా బిల్ , రిజిష్ట్రేషన్ల గురించి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సబ్సిడీ విద్యుత్ అంద చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 1100 కోట్లు ఖర్చు అవుతుందని చెప్ఆరు. ఖర్చు ముఖ్యం కాదు ఆక్వా రంగాన్ని గాడిలో పెడుతున్నామని అన్నారు.
రైతులకు లాభదాయకంగా ఉండేలా రైతులతో, ఆక్వా రంగ పెద్దలతో మాట్లాడి ఆక్వా చట్టాన్ని రూపొందించాం అన్నారు. 20 శాతం మంది ఆక్వా రైతులు ఇప్పటివరకు రిజిష్ట్రేషన్ చేయించు కోలేదన్నారు.