
ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల : దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ని తిరుమల పుణ్య క్షేత్రంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ ) చైర్మన్ బీఆర్ నాయుడు. ఎన్ఆరిల దాతృత్వంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక సదుపాయం భక్తుల దర్శన అనుభవాన్ని మరింత సౌకర్యవంతం చేయనుందని చెప్పారు. బుధవారం ఐసీసీసీ సెంటర్ ను అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. ఇవాల్టి నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు రానున్నారని చెప్పారు టీటీడీ చైర్మన్. ఇదే సమయంలో భక్తుల రద్దీని AI ద్వారా (real-time) అంచనా వేసేందుకు దీని ద్వారా వీలవుతుందన్నారు. ఫేస్ రికగ్నిషన్ సీసీటీవీ తో భద్రతా పర్యవేక్షణ చేస్తామన్నారు బీఆర్ నాయుడు. 3D మ్యాప్స్ ద్వారా క్యూ లైన్లు, వసతి , ఇతర సౌకర్యాలను పరిశీలించేందుకు వీలు కలుగుతుందన్నారు. తప్పిపోయిన వారిని గుర్తించడం, అత్యవసర మార్గాలను చూపించడం జరుగుతుంందని చెప్పారు చైర్మన్. సోషల్ మీడియాలోని తప్పుడు సమాచారం , సైబర్ దాడుల నియంత్రణ మరింత వీలవుతుందన్నారు. భక్తుల హావభావాల ద్వారా వారి ఇబ్బందులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐసీసీసీని ప్రారంభించనున్నారని చెప్పారు.