
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకారంపై ప్రకటన
హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనంగా మారారు. ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై కామెంట్ చేశారు. ఈసారి ఈ జాతీయ అత్యున్నత పురస్కారానికి ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ను ఎంపిక చేసింది. ఢిల్లీలోని రాజ్ భవన్ లో జరిగిన ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మోహన్ లాల్ అందుకున్నారు. విశేషం ఏమిటంటే ఆయన అందుకునేందుకు వెళ్లగానే కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు లేచి స్వాగతం పలికారు. ఆయన మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషలలో కీలక పాత్రలు పోషించారు. తన జర్నీలో 150కి పైగా సినిమాలలో నటించారు. భిన్నమైన పాత్రలు పోషించారు.
ఈ సందర్బంగా రామ్ గోపాల్ వర్మ మోహన్ లాల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తను హిందీలో తీసిన బ్లాక్ బస్టర్ మూవీ కంపెనీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు మోహన్ లాల్. ఆయన పాత్రకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. ఈ క్రెడిట్ అంతా వర్మకే దక్కుతుంది. బాలీవుడ్ లో తన సినిమాలతో షేక్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. దాదాసాహెబ్ ఫాల్కే గురించి నాకు పెద్దగా తెలియదు, అతను మొట్టమొదటి సినిమా తీశాడు, నేను చూడలేదు. నేను దానిని చూసిన ఎవరినీ ఎప్పుడూ కలవలేదు, కానీ నేను చూసిన మోహన్ లాల్ గురించి తెలిసిన దాని ప్రకారం, దాదాసాహెబ్ ఫాల్కేకి మోహన్ లాల్ కు అవార్డు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.