
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గురువారం నూతనంగా నిర్మించిన ఏపీసీ 5 భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది భక్తులు వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. తిరుమలలో గోవింద నామం తప్పా ఇతరవేవీ వినిపించ కూడదన్నారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రమని , శ్రీ వేంకటేశ్వర స్వామి కృప వల్లనే ఇవాళ తాను బతికి బయట పడ్డానని చెప్పారు. ఆయన చలవ వల్లనే ముఖ్యమంత్రి మరోసారి కొలువు తీరానని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హెఆర్డీ అండ్ ఐటీ మంత్రి నారా లోకేష్, రెవిన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో వి. వీరబ్రహ్మం, సివీఎస్వో మురళీకృష్ణ, టిటిడి బోర్డు సభ్యులు, సీఈ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.