యూరియా అడిగితే రైతుల‌పై దాడులు చేస్తే ఎలా..?

తెలంగాణ స‌ర్కార్ పై మండిప‌డ్డ మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్ అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని చేసి, రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాడని మండిప‌డ్డారు. ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి అని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. జీఎస్టీలోని అడ్డగోలు స్లాబులతో 8 ఏళ్లలో రూ. 15 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి, ప్రజలను పండుగ చేసుకోమనడం మోసం కాదా? దోచుకున్న ఆ డబ్బంతా తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైందని అన్నారు కేటీఆర్. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలను నిలబెట్టు కోలేకపోయారని పేర్కొన్నారు. కానీ, దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ.1200, రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించారని ఆరోపించారు. వీటి ధరలు తగ్గిస్తే ప్రజలు పండుగ చేసుకుంటారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అని కేటీఆర్ విమర్శించారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వం అన్నారు. శ్రీరాముడు కూడా బీజేపీ మోసాన్ని గ్రహించి అయోధ్యలో ఆ పార్టీని ఓడించారని అన్నారు.

  • Related Posts

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *