
ఏపీ సర్కార్ కు విన్నవించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు
అమరావతి : ఆరుగాలం శ్రమించే విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఏపీ సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు.
రాష్ట్ర రాజధానిలో విశ్వ కర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నిర్మించే వాణిజ్య సముదాయాల్లో కార్పెంటర్స్, స్వర్ణ కారుల కోసం ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్లు 50 ఏండ్ల నిండిన వారికి, విశ్వబ్రాహ్మణ వృత్తుల వారికి అందించాలని అన్నారు . ఐదు వృత్తుల వారి కోసం ప్రత్యేక పారిశ్రామిక విధానం అమలు చేయాలన్నారు. వారికి వారికి ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని అన్నారు. విశ్వకర్మ జయంతిని శ్రామికుల దినోత్సవం గా జరుపు కోవాలని, అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలన్నారు. యజ్ఞాలు చేయించాలని సూచించారు.
ఆలయాల్లో ఐదు వృత్తులకు సంబంధించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అంతే కాకుండా స్థపతులను నియమించాలని డిమాండ్ చేశారు మాధవ్. ఏదైనా ఒక నైపుణ్య కోర్సులు కలిగిన యూనివర్సిటీ కి విశ్వకర్మ పేరు పెట్టాలని అన్నారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ కు భారీగా నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. కార్పొరేషన్ ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేసి అమ్మకాలు నిర్వహించాలని అన్నారు. తద్వారా ఆదాయం చేకూర్చి విశ్వ బ్రాహ్మణుల్లో వృత్తి పరమైన ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న కుటుంబాలను ఆత్మహత్యల వైపు వెళ్లకుండా వడ్డీ లేని రుణాలతో ఆదుకోవాలని కోరారు. సంచార జాతుల కుల ధృవీకరణ / కుల గుర్తింపు కోసం జిల్లా ఏజెన్సీ ఏర్పాటు చేయాలని మాధవ్ ముఖ్యమంత్రికి విన్నవించారు.