వైకుంఠ నాథుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

పెద్ద‌శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై( పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామి వారిని సేవిస్తూ పాన్పుగా దాస్య భక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేశారు.

ఉత్స‌వాల‌లో భాగంగా భారీ ఎత్తున భ‌క్తులు పోటెత్తారు ప‌విత్ర‌మైన పుణ్య క్షేత్రం తిరుమ‌ల కొండ‌కు. కొరిన కోర్కెలు తీర్చే ఆ దేవ దేవుడి క‌రుణ కటాక్షం కోసం బారులు తీరారు. విను వీధుల‌న్నీ క్రిక్కిరిసి పోయాయి భ‌క్త బాంధ‌వుల‌తో. గోవిందా గోవిందా , ఆప‌ద మొక్కుల వాడా అనాధ ర‌క్ష‌కా, అదివో అల్ల‌దివో శ్రీ‌హ‌రి వాస‌ము, కొండ‌ల‌లో నెల‌కొన్న కోనేటి రాయడు వాడు అంటూ భ‌క్తుల సంకీర్త‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లి పోయింది. స్వామి వారిని ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్, ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్ , ఆనం రామ నారాయ‌ణ రెడ్డితో పాటు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై సంతృప్తిని వ్య‌క్తం చేశారు సీఎం.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *