
చిరకాల ప్రత్యర్థి ఇండియాతో ఫైట్
దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన కీలకమైన ఆసియా కప్ 2025 ఫైనల్ కు దర్జాగా చేరుకుంది పాకిస్తాన్ జట్టు. సూపర్ 4 లో భాగంగా జరిగిన సెమీస్ లో బంగ్లాదేశ్ జట్టును 11 రన్స్ తేడాతో ఓడించింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది పాకిస్తాన్ . నిర్ణీత 20 ఓవర్లలో 136 రన్స్ చేసింది. అనంతరం 137 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు చివరి బంతి వరకు పోరాడింది. 9 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగుల వద్దే ఆగి పోయింది బంగ్లాదేశ్ జట్టు. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో పాకిస్తాన్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ప్రధానంగా స్టార్ బౌలర్లు అఫ్రిదీ కేవలం 17 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీయగా రౌఫ్ మరో ముగ్గురిని పెవిలియన్ కు పంపించాడు. దీంతో బంగ్లాదేశ్ పతనం ప్రారంభమైంది.
మరో వైపు తన చిరకాల ప్రత్యర్థి భారత జట్టుతో మరోసారి తలపడనుంది ఈ విజయం తర్వాత పాకిస్తాన్. ఎట్టకేలకు ఆసియా కప్ ఫైనల్ కు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండుసార్లు భారత జట్టు చేతిలో పరాజయం తప్పలేదు దాయాది జట్టుకు. కానీ అనూహ్యంగా ముచ్చటగా మూడోసారి ఇండియాతో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో అత్యంత బలమైన జట్టుగా తయారైంది భారత్. దీంతో ఇరు జట్లు ఆదివారం ఆసియా కప్ ఫైనల్ లో తలపడనున్నాయి. దీంతో మరింత హీట్ పెంచేలా చేసింది వరల్డ్ క్రికెట్ లో. కాగా శుక్రవారం భారత జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన శ్రీలంక జట్టుతో మ్యాచ్ ఆడనుంది దుబాయ్ లో.