
లడఖ్ లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఆందోళన
లడఖ్ : గత కొన్నేళ్లుగా తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు లడఖ్ వాసులు. ఇటీవల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఇందుకు కీలకంగా ఉన్నారు పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ . ఆయన పేరుతో ఓ సినిమా కూడా ఉంది. ప్రజలను ప్రేమించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఈ సమయంలో లడఖ్ లో ఆయన ఏది చెపితే అది. కానీ ఉన్నట్టుండి ఆందోళనకారులు లా అండ్ ఆర్డర్ ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ. ఈ మేరకు శుక్రవారం ఉపవాస దీక్ష చేపట్టిన పర్యావరణ యాక్టివిస్ట్ సోనం వాంగ్ చుక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన వల్లనే ఆందోళనలు మిన్నంటాయని, అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు.
కొన్ని సంవత్సరాల నుంచి లడఖ్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ వస్తున్నారు. తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిని ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది కేంద్ర సర్కార్. ఈ మేరకు తనను అదుపులోకి తీసుకవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ తరుణంలో అత్యంత నిజాయితీగా, శాంతియుతంగా ఉపవాస దీక్షను చేపట్టారు. ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా చర్చల ద్వారా, శాంతియుతంగానే పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే తనను ద్రోహిగా కేంద్రం పేర్కొనడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఖండించారు.