భ‌క్తుల‌కు ఖుష్ క‌బ‌ర్ భ‌క్తులు ఇక నో ఫిక‌ర్

తిరుమ‌ల‌లో భారీ ఎత్తున వ‌స‌తి స‌ముదాయం

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా దీనిని ప్రారంభించారు సీఎం, ఉప రాష్ట్ర‌ప‌తి. పీఏసీ 5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు గానూ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనం ద్వారా ఒకేసారి 4 వేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా నిర్మించారు. ఈ నూతన వసతి సముదాయంలో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలూ వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్ 5 ను తీర్చిదిద్దారు.

అంతే కాకుండా ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణ కట్టను కూడా ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ పీఏసీ 5 ప్రాంగణంలో ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చేసింది. ఒకేసారి 1400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్సులో రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గా ఈనెల 24 నుంచి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ఎక్క‌డ చూసినా గోవింద నామ స్మ‌ర‌ణ వినిపిస్తోంది. ఈవో సింఘాల్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు.

  • Related Posts

    తిరుమ‌ల త‌ర‌హాలో శ్రీ‌శైలం ఆల‌య అభివృద్ధి

    త‌యారు చేయాల‌ని ఆదేశించిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం త‌ర‌హాలో శ్రీ‌శైల భ్ర‌మ‌రాంభికా మ‌ల్లికార్జున స్వామి ఆల‌యాన్ని అభివృద్ది చేయాల‌ని ఆదేశించారు. ఆదివారం స‌చివాల‌యంలో సీఎం స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు…

    కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

    పెద్ద ఎత్తున హాజ‌రైన శ్రీ‌వారి భ‌క్తులు తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *