
పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు
విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరింత శక్తివంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు సీఎం. శనివారం విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీస్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తమ సర్కార్ పెద్ద ఎత్తున సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. ప్రజలకు 700 కి పైగా సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. 1998 లో తాను కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చానని చెప్పారు.
ఇది టెలికాం రంగంలో నియంత్రణ సడలింపునకు దారి తీసిందన్నారు. ఇవాళ బీఎస్ఎన్ఎల్ శక్తివంతమైన సంస్థగా మారిందని గమనించానని చెప్పారు సీఎం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. సరైన సమయంలో సరైన స్థానంలో సరైన వ్యక్తి అని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. భారతదేశం సరైన నాయకుడు లేక పోవడం వల్లే నష్ట పోయిందని, కానీ వనరులు లేదా తెలివితేటలు లేక పోవడం వల్ల కాదని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాస, డిజిటల్ ఇండియా’, ఆత్మనిర్భర్ భారత్ వంటి వాటిని తీసుకు రావడంలో మోదీ చూపిన చొరవను ప్రత్యేకంగా ప్రస్తావించారు నారా చంద్ర బాబు నాయుడు.