
58 బంతుల్లో 107 రన్స్ తో సెన్సేషన్ సెంచరీ
దుబాయ్ : ఆసియా కప్ మెగా టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన సూపర్ ఫోర్ లో శ్రీలంక పై సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది. మరోసారి తన సత్తాను చాటాడు యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ. 51 బంతుల్లో 61 రన్స్ చేయగా తిలక్ వర్మ 49 పరుగులు చేస్తే సంజూ శాంసన్ 39 పరుగులతో రాణించాడు. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రధానంగా యంగ్ క్రికెటర్ పాతుమ్ నిస్సాంక సంచలన శతకం చేశాడు.
ప్రతి బౌలర్ ను ఉతికి ఆరేశాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. తను కేవలం 58 బంతులు ఎదుర్కొని 107 రన్స్ చేశాడు. తన కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు ఆసియా కప్ టోర్నీలో. అంతే కాదు భారత్ పై శతకం కొట్టిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. ఇదిలా ఉండగా ఆసియా కప్ ఫార్మాట్ లో మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు ఇండియాకు చెందిన విరాట్ కోహ్లీ, హాంకాంగ్ కు చెందిన బాబర్ హయత్ లు సెంచరీలు కొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన యార్కర్‌ను క్లీన్ స్ట్రైక్‌తో ఫోర్ కొట్టి శతకం పూర్తి చేశాడు పాతుమ్ నిస్సాంక. ఇక శ్రీలంక జట్టు తరపున మహిళా జయవర్దనే , కుశాల్ పెరీరా , తిలకరత్నే దిల్షాన్ సెంచరీలు కొట్టారు. మరో వైపు నిస్సాంకతో కలిసి పెరీరా 2వ వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.