గ‌రుడ వాహ‌న సేవ రోజు ట్రాఫిక్ మ‌ళ్లింపు

Spread the love

వెల్ల‌డించిన తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బారాయ‌యుడు
తిరుపతి జిల్లా : తిరుమ‌ల‌లో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా వేలాదిగా వాహ‌నాలు వ‌స్తుండ‌డంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డుతోంది. మ‌రో వైపు స్వామి వారి గ‌రుడ వాహ‌న సేవ రోజున భ‌క్తులు ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు.

గరుడ వాహన సేవ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల తిరుపతి నగరంలో ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లోకి వస్తాయని తెలిపారు.

  1. RTC రవాణా సౌకర్యం – తిరుపతి నుండి తిరుమల వరకు APSRTC మరియు TTD ప్రత్యేక బస్సులు నిరంతరం నడపబడతాయి. భక్తులు వీటినే వినియోగించాలి.
  2. అలిపిరి – కపిలతీర్థం మార్గం – భక్తుల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఉంచబడింది. ప్రైవేట్ వాహనాలకు పరిమితులు ఉంటాయి.
  3. RTC బస్ స్టాండ్ – అలిపిరి రోడ్ – వాహన రాకపోకలకు కేటాయించిన మార్గాలు మాత్రమే ఉపయోగించాలి. భక్తులు RTC బస్సులు/TTD వాహనాలను వినియోగించాలి.
  4. ప్రైవేట్ వాహనాలు – కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలోనే నిలిపి ఉంచాలి. రోడ్ల పక్కన, అనధికారిక ప్రదేశాలలో వాహనాలు నిలపరాదు.
  5. వీధి వ్యాపారులు – ప్రధాన రహదారులపై వ్యాపారానికి అనుమతి లేదు. ట్రాఫిక్ ప్రవాహం సజావుగా ఉండేందుకు సహకరించాలి.
  6. అత్యవసర వాహనాలు – అంబులెన్స్, ఫైర్ సర్వీస్, పోలీస్ వాహనాలకు మాత్రమే ప్రాధాన్యత మార్గాలు ఖాళీగా ఉంచబడతాయి.
  7. ప్రత్యేక బోర్డులు, మైక్ ప్రకటనలు – ట్రాఫిక్ మార్పులు, డైవర్షన్లకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా పాటించాలి.

భక్తులందరూ పోలీస్ శాఖ, TTD సిబ్బంది, వాలంటీర్లకు సహకరించి భద్రతగా, ప్రశాంతంగా గరుడ వాహన సేవ దర్శించు కోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. గరుడ వాహన రోజున తిరుపతి పట్టణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామ‌న్నారు. పార్కింగ్ ప్రదేశాల కొరకు క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగించు కోవాలని సూచించారు ఎస్పీ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల‌ సందర్బంగా గరుడ సేవకు తిరుపతి వస్తున్న భక్తులు వారి వాహనాలను కింది సూచించిన పార్కింగ్ ప్రదేశాలలో నిల‌పాల‌ని కోరారు . శనివారం రాత్రి 9 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అలిపిరి ఘాట్ రోడ్లలో అనుమతి లేదన్నారు.

1.కడప, శ్రీకాళహస్తి వైపు నుండి వచ్చే వాహనాలకు ఇస్కాన్ గ్రౌండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్ లలో టూ వీలర్ , ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం కలదు.
2 చిత్తూరు, పీలేరు మరియు ఇతర జిల్లాల నుండి వచ్చే టూరిస్టు వాహనాలు, టెంపో ట్రావెల్స్ వాహనాలకు దేవలోక్ ప్రాంగణంలో పార్కింగ్ సౌకర్యం ఉంది.
3.మదనపల్లి, చిత్తూరు నుండి వచ్చే వాహనాలకు భారతీయ విద్యాభవన్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్ లలో ఫోర్ వీలర్ పార్కింగ్ సదుపాయం కలదు.
4గరుడ సేవకు టూ వీలర్లలో వచ్చే యాత్రికులకు అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద టూ వీలర్ పార్కింగ్ సదుపాయం కలదు.
5.కరకంబాడి వైపు నుండి వచ్చే వాహనాలకు ఎస్.వి. ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద కట్-ఆఫ్ పార్కింగ్ ఏర్పాటు చేయబడింది.
6.మదనపల్లి, చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు వకులమాత ఆలయం, చెర్లోపల్లి వద్ద పార్కింగ్ సదుపాయం కలదు.
7.పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు మ్యాంగో మార్కెట్ నందు పార్కింగ్ సదుపాయం కలదు.
8.ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏమనగా — చిత్తూరు, మదనపల్లి వైపు నుండి తిరుపతి లోపలికి వచ్చే RTC బస్సులు ఇకపై కాలూరు క్రాస్ మీదుగా, ఆర్.సీ.పురం మీదుగా, తనపల్లి – గరుడ ఫ్లై ఓవర్ గుండా బస్ స్టాండ్కు మళ్లించబడతాయి.
9.తిరుమలకు RTC బస్సుల ద్వారా ప్రయాణించే యాత్రికులు, నంది సర్కిల్ మరియు గరుడ సర్కిల్ మార్గం గుండా యథాప్రకారం తిరుమల వెళ్తారు. పై పార్కింగ్ ప్రాంతాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వ‌ర్యంలో త్రాగు నీరు, భోజనం, టాయిలెట్స్ సదుపాయాలు . తిరుపతి నుండి తిరుమలకు చేసుకోవడానికి 24/7 RTC బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైనది.

తిరుమలలో పార్కింగ్ ఏర్పాట్లు

1.రాంభగీచ పార్కింగ్:- వివిఐపి పెద్ద బ్యాడ్జెస్ వాహనాలు.
2.సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్:- విఐపి చిన్న బ్యాడ్జెస్ వాహనాలు.
3.సాధారణ వాహనాలు:- ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు పార్కింగ్ చేసుకోవాలి.

భక్తులకు విజ్ఞప్తి : సెప్టెంబర్ 27న రాత్రి 9 గంటల నుండి 29న ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేయబడ్డాయి. అలిపిరి పాత చెక్పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించబడుతుంది. పార్కింగ్ ప్రదేశాల కోసం QR కోడ్ ను ఉపయోగించుకోవాలి. భక్తులు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ, టీటీడీకి సహకరించాలని కోరారు ఎస్పీ.

  • Related Posts

    అంగ‌రంగ వైభ‌వంగా ప్ర‌భ‌ల తీర్థం పండుగ‌

    Spread the love

    Spread the loveరాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభల తీర్థం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ. పురాతన శివాలయాల నుండి ఏకాదశ రుద్రులను (శివుని పదకొండు రూపాలు)…

    సీఎం చంద్ర‌బాబు దంప‌తులకు శ్రీ‌వారి ప్ర‌సాదం

    Spread the love

    Spread the loveనారా వారి ప‌ల్లెలో అందించిన‌ ఈవో సింఘాల్ తిరుప‌తి జిల్లా : సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి ప‌ల్లెలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *