భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ కు బీసీసీఐ నివాళి

అస్సాం వేదిక‌గా ఐసీసీ ఉమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్

ముంబై : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇటీవ‌లే సింగ‌పూర్ లో మ్యూజిక్ కచేరి సంద‌ర్బంగా వెళ్లిన అనుమాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు అస్సాంకు చెందిన భూమి పుత్రుడు, ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు జుబీన్ గార్గ్. ఈ మేర‌కు ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించింది యావ‌త్ రాష్ట్ర ప్ర‌జానీకం. ఒక రోజు ప్ర‌భుత్వ సెలవు కూడా ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఈ మేర‌కు అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ సూచ‌న‌ల మేర‌కు ఈ అమ‌ర‌, అద్భుత‌మైన గాయ‌కుడికి అరుదైన నివాళులు అర్పించాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 30 నుంచి అస్సాం వేదిక‌గా మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్ టోర్నీ ప్రారంభం కానుంది.

భార‌త మ‌హిళా జ‌ట్టు తొలి మ్యాచ్ శ్రీ‌లంక జట్టుతో ఆడ‌నుంది. మెగా టోర్నీ ప్రారంభోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నుంది. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది స్వ‌యంగా బీసీసీఐ. అంతే కాకుండా క్రికెట్, గాయ‌కుడి అభిమానుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఉచితంగా 5000 టికెట్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది అస్సాం క్రికెట్ అసోసియేష‌న్, గౌహ‌తి క్రికెట్ అసోసియేష‌న్. అస్సాంకు చెందిన ప్ర‌ముఖ గాయ‌నీ గాయ‌కులంతా క‌లిసి అర‌గంట‌కు పైగా జుబీన్ గార్గ్ కు నివాళులు అర్పిస్తార‌ని ప్ర‌క‌టించింది బీసీసీఐ. త‌ను మ‌ర‌ణించ లేద‌ని త‌న పాట‌లు ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌ని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌.

  • Related Posts

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *