
వీసీ సజ్జనార్ కు సిటీ పోలీస్ కమిషనర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నాగిరెడ్డి. ఇప్పటి వరకు సంస్థ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్ నుంచి ఆయన వైస్ చైర్మన్ గా, ఎండీగా కొలువు తీరారు. . కనెక్టివిటీని విస్తరించడం, సేవలను మెరుగు పరచడం, కార్పొరేషన్ కార్యకలాపాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు నాగిరెడ్డి. బస్ భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నాగిరెడ్డి ఎండీ ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎండీగా ఉన్న సజ్జనార్ పై బదిలీ వేటు వేసింది సర్కార్. ఆయనను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించింది.
ఇదిలా ఉండగా అందరినీ విస్తు పోయేలా చేశారు వీసీ సజ్జనార్. చివరి రోజున ఆయన ప్రయాణీకులను విస్మయ పరిచారు. తాను సాధారణ ప్రయాణీకుడిలా రోడ్డు పైకి వచ్చారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సిటీ బస్సు ఎక్కారు. తాను కూడా టికెట్ తీసుకున్నారు. యూపీఐ ద్వారా టికెట్ డబ్బులు చెల్లించారు. ఇదే సమయంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులతో ముచ్చటించారు. ఆర్టీసీ సేవలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు సజ్జనార్. తాను బాధ్యతలు స్వీకరించాక ఆర్టీసీలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. డిజటల్ టికెట్ సిస్టమ్ లను తీసుకు వచ్చారు. అంతే కాకుండా లాజిస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీకి ఆదాయం తీసుకు వచచ్చేలా చేశారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆర్టీసీ కార్మికుల నుంచి.