
రెండో స్థానంలో నిలిచిన తిలక్ వర్మ
హైదరాబాద్ : మెగా టోర్నీమెంట్ ఆసియా కప్ 2025 ముగిసింది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ లో దాయాది పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. తనకు ఎదురే లేదని చాటింది. టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడింది. అన్నింటిని గెలుపొందింది. పాకిస్తాన్ ను మూడుసార్లు పరాజయం పాలు చేసింది. టోర్నీలో స్టార్ యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ పరుగుల పరంగా చూస్తే టాప్ లో నిలిచాడు. తను 7 మ్యాచ్ లు ఆడి 314 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక రెండో ప్లేస్ లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ 7 మ్యాచ్ లలో 213 రన్స్ చేశాడు. ఇందులో 69 నాటౌట్ అత్యధిక స్కోర్. శర్మ అత్యధిక స్కోర్ 75 పరుగులు. పాకిస్తాన్ ఓపనెర్ ఫర్హాన్ 217 రన్స్ తో టాప్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఆరు మ్యాచ లో ఆడి 48 రన్స్ చేశాడు. 120 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.
ఇక ఈ టోర్నీలో ప్రత్యేకంగా చెప్పాల్సింది శ్రీలంక జట్టు గురించి. ఆ జట్టు తరపున ఆడిన పాతుమ్ నిస్సాంక తళుక్కున మెరిశాడు. భారత్ పై సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. ఇండియా బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. తను 107 రన్స్ చేశాడు. మరో క్రికెటర్ కుశాల్ పెరీరా 146 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ సైఫ్ హసన్ నాలుగు మ్యాచ్ లు ఆడి 178 రన్స్ చేశాడు. కుల్దీప్ యాదవ్ 17 వికెట్లు తీశాడు. టాప్ లో నిలిచాడు. షాహిన్ అఫ్రిది 7 మ్యాచ్ లలో 10 వికెట్లు తీశాడు. జస్పీత్ బుమ్రా 135 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీశాడు.