
రెనె ఒబెర్మాన్ ను కలిసిన ఐటీ మంత్రి
ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు తండ్రీ కొడుకులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తాజాగా దేశ రాజధానిలో ఎయిర్ బస్ బోర్డు చైర్మన్ రెనే ఒబెర్మాన్ నేతృత్వంలోని బృందాన్ని కలిశారు. తమ రాష్ట్రంలో ఏరోస్పేస్ తయారీ కేంద్రానికి అనుమతి ఇవ్వాలని లోకేష్ ప్రతిపాదించారు. వేగవంతమైన అనుమతులు ఇస్తామి, సింగిల్ విండో ఫెసిలిటేషన్ కల్పిస్తామని చెప్పారు. అమరావతి నుండి ఢిల్లీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థను ఎంకరేజ్ చేయడంపై దృష్టి సారించాలని కోరారు. ఇందుకు సంబంధించి తమ రాష్ట్రంలో అనువైన భూమి ఉందన్నారు లోకేష్.
అంతే కాకుండా ప్రగతిశీల ఏరోస్పేస్ విధానం, బహుళ-కారిడార్ ఎంపికలు, సహ-స్థానిక విక్రేత సమూహాలతో, సంక్లిష్ట కార్యక్రమాలకు వేగం, స్థాయి, ప్రపంచ పోటీతత్వాన్ని అందించడానికి ఏపీ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు ఈ సందర్బంగా ఎయిర్ బస్ బోర్డు చైర్మన్ కు. తమ లక్ష్యం స్పష్టంగా ఉందన్నారు.
అధిక-నాణ్యత ఉద్యోగాలను సృష్టించే, ఆవిష్కరణలను అభివృద్ధి చేసే పనిలో పడ్డామన్నారు. ఎయిర్ బస్ ను ఏర్పాటు చేస్తే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇదిలా ఉండగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ , సీఆర్ పాటిల్ లను కలిశారు. పూర్ణోదయ పథకం కింద ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించారు.