తిల‌క్ వ‌ర్మ‌కు ఘ‌న స్వాగ‌తం

ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో స‌త్తా

హైద‌రాబాద్ : ఆసియా క‌ప్ మెగా టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘ‌న విజ‌యం సాధించింది భార‌త జ‌ట్టు. ఈ కీల‌క పోరులో టీమిండియా విజ‌యం సాధించేందుకు నానా తంటాలు ప‌డింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం 147 ర‌న్స్ ల‌క్ష్య ఛేద‌న‌లో బ‌రిలోకి దిగింది భార‌త జ‌ట్టు. ఈ సంద‌ర్బంగా 21 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 3 వికెట్లు కోల్పోయింది. టోర్నీలో దంచి కొడుతూ వ‌స్తున్న అభిషేక్ శ‌ర్మ నిరాశ ప‌రిచాడు. కెప్టెన్ సూర్య కుమార్ , శుభ్ మ‌న్ గిల్ లు వెను వెంట‌నే పెవిలియ‌న్ బాట ప ట్టారు. ఈ త‌రుణంలో ఇండియా గెలుస్తుందా అన్న అనుమానం నెల‌కొంది. మైదానంలోకి వ‌చ్చిన కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ , తిల‌క్ వ‌ర్మ‌తో క‌లిసి జ‌ట్టు స్కోర్ ను కుదుట ప‌ర్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి కీల‌క‌మైన 54 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. 24 ర‌న్స్ చేసిన శాంస‌న్ సిక్స్ కొట్టే ప్ర‌య‌త్నంలో అవుట్ అయ్యాడు.

యంగ్ క్రికెట‌ర్ శివ‌మ్ దూబే వ‌చ్చీ రావ‌డంతోనే అటాక్ చేశాడు. త‌న‌తో పాటు తిల‌క్ వ‌ర్మ రెచ్చి పోయాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి మరో కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు. 64 ర‌న్స్ చేశారు. 33 ప‌రుగులు చేసిన దూబే అవుట్ అయ్యాక మిగ‌తా ర‌న్స్ ను రింకూ సింగ్ పూర్తి చేశాడు. ఆట చివ‌రి దాకా ఉన్నాడు తిల‌క్ వ‌ర్మ‌. త‌ను 53 బంతులు ఎదుర్కొని 69 ప‌రుగులు చేశాడు. ఈ సంద‌ర్బంగా కీల‌క పాత్ర పోషించిన వ‌ర్మ దుబాయ్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ శాప్ నుంచి త‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వేలాది మంది అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు.

  • Related Posts

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్…

    జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *