పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. బుధ‌వారం పెన్ష‌న్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడారు.
లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పింఛను అందిస్తున్నాం అన్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే ప్రతీ నెలా 2,75,682 మందికి రూ.117 కోట్లు పింఛన్లు రూపంలో ఇస్తున్నామ‌ని తెలిపారు. జ‌గ‌ప‌తిన‌గ‌రం నియోజకవర్గంలో 39,641 మందికి రూ.17 కోట్లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. దత్తి గ్రామంలో 706 మందికి నెలకు రూ.29 లక్షలు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ 1985లో రూ. 30తో పింఛను పథకాన్ని ప్రారంభించార‌ని, తాను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని రూ. 75 చేశానని గుర్తు చేశారు. 2014లో రూ. 1000 , ఆపై 2000 వేలకు పెంచానని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పింఛను ఇవ్వడంలేదని ముఖ్యమంత్రి అన్నారు. పింఛన్ల పంపిణీ బాధ్యతగా చేపట్టాం అన్నారు. మానవత్వంతో ఆలోచిస్తున్నామ‌ని చెప్పారు. రూ.4,000 నుంచి రూ.15,000 వరకు పెన్షన్లు ఇస్తున్నామ‌ని తెలిపారు. పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి నెలా ఒక జిల్లాకు వచ్చి స్వయంగా పింఛను పంపిణీ చేస్తున్నానని ప్ర‌క‌టించారు. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రం కూడా పెన్షన్ల కోసం ఏడాదికి ఖర్చు చేస్తుంది కేవలం రూ.5,160 కోట్లు మాత్రమేన‌ని పేర్కొన్నారు. తెలంగాణలో ఏడాదికి రూ.8,179 కోట్లు ఇస్తుంటే మన రాష్ట్రంలో ఏడాదికి రూ.32,143 కోట్లు ఖర్చు చేస్తున్నామ‌ని అన్నారు సీఎం. నెలనెలా పెన్షన్ తీసుకుంటున్న వారిలో 59 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు పింఛన్ల కోసం 16 నెలల్లో ఖర్చు చేసిన రూ.48,019 కోట్లలో రూ.28,331 కోట్లు మహిళలకు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చంద్ర‌బాబు అన్నారు.

  • Related Posts

    రేపే సీఎం చంద్ర‌బాబు పుట్ట‌ప‌ర్తికి రాక‌

    22,23వ తేదీల‌లో ముఖ్య‌మంత్రి టూర్ అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పుట్ట‌ప‌ర్తిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 22, 23 తేదీల‌లో రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు…

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *