దేశం కోసం ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త మ‌ర‌ణించారా..?

సంచల‌న వ్యాఖ్య‌లు చేసిన అస‌దుద్దీన్ ఓవైసీ

హైద‌రాబాద్ : ఎంఐఎం చీఫ్ , ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఆర్ఎస్ఎస్ సంస్థ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్యత సంత‌రించుకుంది. గురువారం ఓవైసీ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ స‌భ్యుడు మ‌ర‌ణించారా అని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ ఉంటే ఆ వివ‌రాలు బ‌హిరంగంగా వెల్ల‌డించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 1930, 1942 లో జ‌రిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు చురుకుగా పాల్గొనలేదని పేర్కొన్నారు. ఇందుకు సంబఃధించిన చారిత్రిక వివ‌రాలు కూడా వెల్ల‌డించారు. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక విధానాల‌ను అవ‌లంభించ‌డం లేద‌న్నారు.

ఆర్ఎస్ఎస్ భావ‌జాలం పూర్తిగా భార‌త దేశానికి విరుద్దంగా ఉంద‌న్నారు. గోల్వాల్క‌ర్ వంటి నాయ‌కుల చ‌రిత్ర చూస్తే బాగా అర్థం అవుతుంంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఆయన తన ‘ఎ బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంలో క్రైస్తవులు, ముస్లింలు, వామపక్షవాదులను అంతర్గత బెదిరింపులు”గా ముద్ర వేశారని ఆరోపించారు. ఇదిలా ఉండగా భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వాదనలను ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు, దేశ స్వాతంత్రం కోసం ఏ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడు కూడా తమ ప్రాణాలను త్యాగం చేయలేదని నొక్కి చెప్పారు. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మోదీని ఏకి పారేశారు.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *