ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ర్ణాట‌క నువ్వా నేనా

పోటా పోటీగా పెట్టుబ‌డుల వెల్లువ

అమ‌రావ‌తి : పెట్టుబ‌డులను ఆక‌ర్షించ‌డంలో పెద్ద ఎత్తున పోటీ ప‌డుతున్నాయి ఆంధ్ర‌ప్ర‌దేశ్, కాంగ్రెస్ రాష్ట్రాలు. బెంగళూరులో మౌలిక సదుపాయాల సమస్యను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఉంటుందని లోకేష్ పేర్కొన‌డం పుండు మీద కారం చ‌ల్లిన‌ట్ల‌యింది. మ‌రో వైపు కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడంపై వాగ్వాదానికి దిగారు. ఇరు రాష్ట్రాల ఐటీ మినిష్ట‌ర్లు ఇన్వెస్ట్మెంట్స్ విష‌యంలో వాగ్వాదానికి దిగ‌డం ఆశ్చ‌ర్య పోయేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా భారతదేశంలోన అతి చిన్న రాష్ట్రంగా తాము అభివృద్ధి చెందడానికి , ఉద్యోగాలను సృష్టించడానికి ప్రతి అవకాశాన్ని వెతుకుతున్నామని అన్నారు నారా లోకేష్. ఆయా రాష్ట్రాలు పెట్టుబడులు, ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నప్పుడు, భారతదేశం అభివృద్ధి చెందుతుందని తాను నిజంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. అనంత‌పురంలో ప్ర‌పంచ స్థాయి ఏరో స్పేస్ ను, రక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు నారా లోకేష్‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు మినిష్ట‌ర్ ఖ‌ర్గే.

బలహీనమైన పర్యావరణ వ్యవస్థలు బలమైన వాటిని పోషించడం సహజం. దానిలో తప్పు లేదు, కానీ అది తీరని చెత్తను పారవేసేటప్పుడు, అది బలం కంటే బలహీనతను ఎక్కువగా చూపిస్తుంది అంటూ ఎద్దేవాచేశారు ఖ‌ర్గే. బెంగళూరు ఆస్తి మార్కెట్ 2025లో ఐదు శాతం పెరుగుతుందన్నారు. బెంగళూరు పట్టణ సముదాయం 2025లో 14.40 మిలియన్ల మందిని కలిగి ఉంటుందని అంచనా వేశార‌న్నారు.
వార్షిక వృద్ధి రేటు 2.76 శాతం. భారతదేశంలో అత్యధిక వలస నగరాల్లో త‌మ న‌గ‌రం ఉంద‌న్నారు.

Related Posts

ఏపీ స్పీక‌ర్ కు అరుదైన అవ‌కాశం

68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం అమ‌రావ‌తి : ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుకు అరుదైన అవ‌కాశం ల‌భించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వ‌ర‌కు బార్బాడోస్ లో జ‌రిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి…

ఆటో డ్రైవ‌ర్ల‌ను మోసం చేసిన సీఎం

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ష‌ర్మిల విజ‌య‌వాడ : హామీలు ఇవ్వ‌డంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మించి పోయాడ‌ని మండిప‌డ్డారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ స‌ర్కార్ ను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *