ఆధునిక సాంకేతిక శిక్షణకు ముందడుగు

నైలెట్ ప్రారంభోత్స‌వంలో ఎంపీ గురుమూర్తి

తిరుప‌తి : తిరుపతిలో నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ “నైలెట్” కేంద్రం శుక్ర‌వారం ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రస్తుతం వేంకటేశ్వర విశ్వ విద్యాలయ ప్రాంగణంలో తాత్కాలిక భవనంలో దీనిని ఏర్పాటు చేశారు. నైలెట్ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక ఐటీ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ కేంద్రం స్థాపన కోసం ఎంపీ గురుమూర్తి నిరంతరం కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

నైలెట్ ఆవిర్భావం తిరుపతిలో సాంకేతిక శిక్షణకు కొత్త మలుపని ఎంపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. నైలెట్‌లో ఐటీ సంబంధిత శిక్షణతో పాటు వెబ్ డిజైనింగ్, పీసీ హార్డ్‌వేర్ , నెట్‌వర్కింగ్, ఆఫీస్ ఆటోమేషన్, అకౌంటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి షార్ట్‌టర్మ్ కోర్సులు అందించనున్నారని చెప్పారు. అదనంగా, ఎంబీడెడ్ సిస్టమ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సెమికండక్టర్ డిజైన్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లోనూ శిక్షణ లభించనుంద‌ని చెప్పారు ఎంపీ గురుమూర్తి. నైలెట్ కేంద్రం వల్ల తిరుపతి యువతకు దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Related Posts

    ఏపీ స్పీక‌ర్ కు అరుదైన అవ‌కాశం

    68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం అమ‌రావ‌తి : ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుకు అరుదైన అవ‌కాశం ల‌భించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వ‌ర‌కు బార్బాడోస్ లో జ‌రిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి…

    ఆటో డ్రైవ‌ర్ల‌ను మోసం చేసిన సీఎం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ష‌ర్మిల విజ‌య‌వాడ : హామీలు ఇవ్వ‌డంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మించి పోయాడ‌ని మండిప‌డ్డారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ స‌ర్కార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *