క‌రూర్ ఘ‌ట‌న‌పై సిట్ ద‌ర్యాప్తు చేప‌ట్టాలి

ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన మ‌ద్రాస్ హైకోర్టు

చెన్నై : ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న త‌మిళ‌నాడులోని క‌రూర్ లో చేప‌ట్టిన ప్ర‌చార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న‌లో 41 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ ప‌లు పిటిష‌న్లు మ‌ద్రాస్ హైకోర్టులో దాఖ‌లు అయ్యాయి. ఇప్ప‌టికే టీవీకే పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర ఆరోప‌ణులు చేసుకున్నారు. కావాల‌నే టీవీకే విజ‌య్ ర్యాలీకి ఆల‌స్యంగా వ‌చ్చారంటూ క‌రూర్ పోలీసులు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ మేర‌కు త‌న‌పై కేసు న‌మోదు చేశారు. తాము కేవ‌లం ర్యాలీకి 10 వేల మందిని మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చామ‌న్నారు. కానీ 50 వేల మందికి పైగా వ‌చ్చార‌ని, దీంతో ఊపిరాడ‌క చ‌ని పోయార‌ని తెలిపారు.

అంతే కాకుండా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రావాల్సిన టీవీకే విజ‌య్ కావాల‌ని రాత్రి 7 గంట‌ల‌కు వ‌చ్చార‌ని ఆరోపించారు. దీంతో ఎండ‌లో నిల్చుని త‌న‌ను చూసేందుకు సొమ్మ‌సిల్లి ప‌డి పోయార‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు చిన్నారులు, 16 మంది మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కేసును శుక్ర‌వారం మ‌ద్రాస్ హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ మేర‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేయాల‌ని డీఎంకే స‌ర్కార్ ను ఆదేశించింది. ఈ ఘ‌ట‌న సెప్టెంబ‌ర్ 27న చోటు చేసుకుంది. కేంద్ర ద‌ర్యాప్తు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు. సీనియ‌ర్ పోలీస్ ఆఫీసర్ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

  • Related Posts

    ఏపీ స్పీక‌ర్ కు అరుదైన అవ‌కాశం

    68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం అమ‌రావ‌తి : ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుకు అరుదైన అవ‌కాశం ల‌భించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వ‌ర‌కు బార్బాడోస్ లో జ‌రిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి…

    ఆటో డ్రైవ‌ర్ల‌ను మోసం చేసిన సీఎం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ష‌ర్మిల విజ‌య‌వాడ : హామీలు ఇవ్వ‌డంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మించి పోయాడ‌ని మండిప‌డ్డారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ స‌ర్కార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *