ఏపీ స్పీక‌ర్ కు అరుదైన అవ‌కాశం

Spread the love

68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం

అమ‌రావ‌తి : ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుకు అరుదైన అవ‌కాశం ల‌భించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వ‌ర‌కు బార్బాడోస్ లో జ‌రిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి సభకు హాజరు కానున్నారు. ఈ సంద‌ర్బంగా స్పందించారు స్పీక‌ర్. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధిగా హాజరు కాగలగడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సీపీఏ వార్షిక సమావేశం, కామన్వెల్త్ పార్లమెంట్ల నుండి వచ్చే సహచరుల నుండి ఆయా ప్రాంతాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలుసు కోవడానికి, వారి అనుభవాల నుండి మంచి విషయాలు నేర్చు కోవడానికి సభ్యులందరికీ అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి సహాయ పడే విలువైన విషయాలు ఈ సమావేశాల్లో నేర్చుకోగలుగుతామని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.

68వ సీపీసీ ప్రధాన ఇతివృత్తం కామన్వెల్త్ భౌగోళిక భాగస్వామి అని పేర్కొన్నారు. . ఈ సమావేశాల్లో ‘ప్రజాస్వామ్యానికి మద్దతుగా పార్లమెంట్లను బలోపేతం చేయడంపై ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతుందన్నారు.
‘ప్రపంచ ఆధునికీకరణకు సాంకేతికత, కృత్రిమ మేధను ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావం, చట్టసభలపై విశ్వాసాన్ని పెంపొందించడం వంటి విస్తృత శ్రేణి అంశాలపై చ‌ర్చిస్తామ‌న్నారు స్పీక‌ర్.
ప్రజాస్వామ్యానికి మద్దతుగా మన వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం, పారదర్శకతను పెంపొందించడం, పార్లమెంట్లు, ఎన్నికలలో ఆర్థిక పారదర్శకత, జాతీయ పార్లమెంట్ లు, ప్రాంతీయ, ప్రాదేశిక, వికేంద్రీకృత చట్ట సభ‌లు, అధికారాల విభజన ప్రాముఖ్యత అనే అంశాలపై నిర్వహించే స‌మావేశాల్లో పాల్గొంటాన‌ని చెప్పారు.

  • Related Posts

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం…

    తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    Spread the love

    Spread the loveఅస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో హైద‌రాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *