కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌న బ‌క్వాస్

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఫైర్

హైద‌రాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌సంగించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే, పరిశ్రమలు పెట్టాలంటే నిధులు ఇయ్యరు. రైల్వే లైన్లకు నిధులు ఇవ్వరు. హైవే కోసం నిధులు ఇవ్వరు. ఐదేళ్ల నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకి నిధులు ఇవ్వడం లేదంటూ కేంద్రంపై మండిప‌డ్డారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. రేపు వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నారు. రేపు తెలంగాణకు నిధులు రావాలంటే మన వాటా మనకు రావాలంటే మన ఎంపీలను గెల్పించు కోవాల‌న్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పన్నులేసుడు తప్ప కొత్తవి ఇచ్చిందేమీ లేన్నారు.

తిరిగి భూముల ధరలు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. బీర్ల ధరలు, విస్కీ ధరలు పెంచిండు. ఆడోళ్ళకి ఫ్రీ బస్సు అన్నాడు. మొగోళ్లకు డబల్ టికెట్ కొడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను బందు పెట్టిండు. నూట్రిషన్ కిట్టు బందు. కేసీఆర్ కిట్ బంద్. బతుకమ్మ చీరలు బంద్ చేశాడంటూ హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ ఉండంగా ఎట్ల ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ చేసిండో ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని అన్నారు. రేవంత్ రెడ్డిది కేవలం దోచుకునే ప్రభుత్వం త‌ప్పా ప్ర‌జ‌ల‌కు మేలు చేసేది కాద‌న్నారు. ఎటు చూసినా కేసీఆర్ రావాలనే గాలి మొదలైందన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్యాకేజీ తెస్తా ప్యాకేజీ తెస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి ప్యాకేజ్ ఇస్తా అన్నాడు. వరదలు వచ్చి రోజులు దాటినా ఒక్క రూపాయి అయినా రేవంత్ రెడ్డి ఇచ్చాడా అని ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10,000 ఇస్తామన్నారు ఒక రూపాయి కూడా ఇవ్వలేద‌న్నారు.

  • Related Posts

    ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను…

    భ‌క్త క‌న‌క‌దాస‌ను స్పూర్తిగా తీసుకోవాలి

    పిలుపునిచ్చిన మంత్రి ఎస్. స‌విత‌ తిరుప‌తి : సాధువు, యోగి భ‌క్త క‌న‌క‌దాసును స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. స‌విత‌. తిరుప‌తి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భ‌క్త క‌న‌క‌దాసు విగ్ర‌హాన్ని ఆమె ఆవిష్క‌రించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *