ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్

అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను మార్చేది చదువేనని మేం నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు-నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చామ‌న్నారు. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్‌, డిజిటల్‌ ప్యానెళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జ‌రిగింద‌న్నారు. పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టామ‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. త‌మ‌ ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నామ‌ని తెలిపారు. మీరు అధికారంలోకి వచ్చాక, మీ సుపుత్రుడు విద్యాశాఖను చేపట్టిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల లాభాలకోసం వారితో చేతులు కలిపి, క్రమంగా ప్రభుత్వ విద్యా సంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారని ఆరోపించారు.

త‌మ‌ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బ తీశార‌ని ఆరోపించారు. ఇంగ్లిషు మీడియంను, సీబీఎస్‌ఈ నుంచి ఐబీదాకా ప్రయాణాన్ని, టోఫెల్‌ క్లాసులు, 8వ తరగతి వారికి ట్యాబులు, సబ్జెక్ట్‌ టీచర్స్‌ కాన్సెప్ట్‌ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద వీటన్నింటినీ నాశనం చేశారని ధ్వ‌జ‌మెత్తారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారని ఆరోపించారు. ఆర్వోప్లాంట్లు రిపేరు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడన్నారు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించ‌డమో, ఆస్పత్రుల పాలవడమో పరిపాటిగా మారిందన్నారు. ఇలాంటి మీ నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం ఆశ్రమ పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసిందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి, వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, వారి బడుల్లో వసతులపట్ల శ్రద్ధపెట్టాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు జ‌గ‌న్ రెడ్డి.

  • Related Posts

    కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌న బ‌క్వాస్

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఫైర్ హైద‌రాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్…

    భ‌క్త క‌న‌క‌దాస‌ను స్పూర్తిగా తీసుకోవాలి

    పిలుపునిచ్చిన మంత్రి ఎస్. స‌విత‌ తిరుప‌తి : సాధువు, యోగి భ‌క్త క‌న‌క‌దాసును స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. స‌విత‌. తిరుప‌తి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భ‌క్త క‌న‌క‌దాసు విగ్ర‌హాన్ని ఆమె ఆవిష్క‌రించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *