బీహార్ లో మ‌ళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈమేర‌కు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌లే అనారోగ్యంతో మృతి చెందారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. దీంతో ఈ స్థానానికి కూడా ఈసీ షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. ఈసీ షెడ్యూల్ పై స్పందించారు అమిత్ చంద్ర షా. బీహార్‌ను జంగిల్ రాజ్ నుంచి ఎన్డీయే విముక్తి చేసిందని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని అమిత్ షా అన్నారు .మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో బీహార్ అభివృద్ధిని హోంమంత్రి ప్రశంసించారు .

వ‌చ్చే నవంబర్ నెల‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మళ్లీ కూటమికి మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మంచి పాలన‌తో కొత్త దిశను ఇచ్చిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మరోసారి అభివృద్ధి రాజకీయాలను ఎంచుకుంటారని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బీహార్ లో రెండు ద‌ఫాలుగా జ‌రిగే ఎన్నిక‌ల‌పై పూర్తి విశ్వాసాన్ని ప్ర‌క‌టించారు. న‌వంబ‌ర్ 6, 11వ తేదీల‌లో రాష్ట్రంలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. ప్రజాస్వామ్యం గొప్ప పండుగకు బీహార్ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. గ‌త కొంత కాలంగా త‌మ‌పై బీహారీలు ఉంచిన న‌మ్మ‌కాన్ని తాము నిల‌బెట్టుకున్నామ‌ని చెప్పారు కేంద్ర హొం శాఖ మంత్రి.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *