
షూను విసిరేసిన లాయర్ కొనసాగించిన విచారణ
ఢిల్లీ : ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది రోజు రోజుకు అపహాస్యానికి లోనవుతోంది. చివరకు న్యాయవ్యవస్థపై సనాతన ధర్మం పేరుతో దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని విస్తు పోయేలా చేసింది. కీలకమైన కేసు విచారణ చేపట్టేందుకు సోమవారం సుప్రీంకోర్టులో ఆసీనులయ్యారు సీజేఐ గవాయ్. ఆ వెంటనే ఒక లాయర్ గట్టిగా అరుస్తూ షూ (బూటు) ను తనపైకి విసిరి వేసేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న వారంతా అప్రమత్తం అయ్యారు. తనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఎక్కడా ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు జస్టిస్ గవాయ్. ఇవన్నీ వృత్తి పరంగా మామూలేనని, విచారణ కొనసాగించాలని సూచించారు. తనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా సంఘటన జరిగిన సమయంలో కోర్టులో ఉన్న ఒక న్యాయవాది స్పందించారు. ప్రధాన న్యాయమూర్తి ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రభావితమైన చివరి వ్యక్తి నేనే. దయచేసి (విచారణను కొనసాగించండి అంటూ పేర్కొన్నారని తెలిపారు. మరో వైపు ఈ సంఘటనను పూర్తిగా దర్యాప్తు చేయాలని సీనియర్ న్యాయ నిపుణురాలు ఇందిరా జైసింగ్ అన్నారు. న్యాయవాది పేరు చెప్పాలి. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది భారత సుప్రీంకోర్టుపై జరిగిన స్పష్టమైన కులతత్వ దాడిగా కనిపిస్తోందన్నారు. సైద్ధాంతిక దాడులను కోర్టు సహించదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ ఐక్యంగా ప్రకటన చేయడం ద్వారా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.