ఆర్టీసీ ఛార్జీల మోత‌పై బీఆర్ఎస్ ఆందోళ‌న

9వ తేదీన పార్టీ ఆధ్వ‌ర్యంలో ఛ‌లో బ‌స్ భ‌వ‌న్

హైద‌రాబాద్ : ఓ వైపు ఫ్రీ బ‌స్ అంటూనే ఇంకోవైపు అడ్డ‌గోలుగా హైద‌రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఆర్టీసీ) పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మేర‌కు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఛార్జీలు త‌గ్గించాల‌ని కోరుతూ ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే పార్టీలో తీర్మానం కూడా చేయ‌డం జరిగింద‌ని చెప్పారు. రాష్ట్రంలో మని సర్కులేషన్ లేకుండా పోయింద‌న్నారు. రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు అయ్యిందంటూ వాపోయారు. రెగ్యులర్ ఆర్టీసీ వాళ్లని తీసేసి ఔట్‌సోర్సింగ్ వాళ్లను పెట్టారు ఆర్టీసీలోన‌ని ఆరోపించారు.

ఇక భద్రత విషయంలో తెలంగాణ‌ ఆర్టీసీకి దేశంలోనే మంచి పేరు ఉంద‌న్నారు. ఆక్సిడెంట్స్‌లు చూస్తే ఆర్టీసీలో చాలా తక్కువగా ఉంటాయన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంద‌న్నారు. ఆ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపడం జరిగిందన్నారు త‌లసాని శ్రీ‌నివాస్ యాద‌వ్. అదే సమయంలో ఎన్నికలు వచ్చాయ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారిని రెగ్యులర్ చేస్తామని, ప్రభుత్వంలో విలీనం చేస్తాం అని చెప్పారు,పీఆర్సీ కూడా ఇస్తాం అన్నారని, కానీ ఇప్పుడు దాని గురించే ఊసెత్తడం లేద‌న్నారు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. ఇవాళ ఇప్పటికే గౌలిగూడ బస్‌స్టాండ్‌ను ప్రైవేట్‌కు ఇచ్చారని, ఇతర బస్టాండ్‌లను, ప్రైవేట్‌కు ఇచ్చేందుకు ప్రయత్నం నడుస్తోందన్నారు.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *