బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ డ్రామాలు ఆపాలి

Spread the love

నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్

హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి భార‌తీయ జ‌న‌తా పార్టీ రెండు నాల్క‌ల ధోర‌ణి అవ‌లంబిస్తోంద‌ని ఆరోపించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. హైదరాబాదులోని అంబర్ పేట‌లో ఉన్న మహత్మ జ్యోతిబాపూలే విగ్రహం ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు . ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు .

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి రెండు నాలుకల విధానం వల్ల బీసీ రిజర్వేషన్ల పై తమకున్న వ్యతిరేక భావనతోనే ఢిల్లీలో రాష్ట్రపతి, గల్లీలో గవర్నర్ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపడం లేదని ఆరోపించారు. రాష్ట్రపతి భవన్ ను రాజభవన్ ను ప్రభావితం చేస్తున్న అదృశ్య శక్తి బిజెపి అని ఆయన తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే కనీసం గవర్నర్ కలిసి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేయించే వారని కానీ ఆ పని బిజెపి చేయడం లేదని ఆయన అన్నారు.

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ లేదని రెడ్డి జాగృతి కి చెందిన రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టుల ను వేదికగా చేసుకుని బీసీలను రాజకీయంగా అణచి వేయాలని కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారి కుట్రలను ఎండగట్టి బీసీ రిజర్వేషన్లను రక్షించుకుంటామని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలకు నిర్వహించామని ఇది బీసీ ఉద్యమానికి ఆరంభం మాత్రమేనని చెప్పారు. ఒక్క శాతం తగ్గినా భవిష్యత్తులో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు.

  • Related Posts

    గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

    Spread the love

    Spread the loveఅంద‌జేస్తామ‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల స‌ర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు…

    డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

    Spread the love

    Spread the loveతెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌ హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *