మోదీ 25 ఏళ్ల పాలన నాయకత్వానికి నమూనా
శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : భారత దేశ సుదీర్ఘ రాజకీయాలలో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా పేరు పొందారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఆయన తన ప్రస్థానాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థతో ప్రారంభమైంది. ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నారు. గుజరాత్ సీఎంగా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఐకాన్ గా మారారు. దేశానికి గుజరాత్ మోడల్ అవసరమని నొక్కి చెప్పారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా 143 కోట్ల ప్రజానీకానికి నాయకుడిగా అవతరించారు. ప్రధానమంత్రిగా ఆయన ముచ్చటగా మూడోసారి కొలువు తీరారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తను అరుదైన మైలు రాయిని చేరుకున్నారు. తను రాజకీయ పరంగా కొలువు తీరి అక్టోబర్ 8వ తేదీ నాటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్బంగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పాలనా కాలాన్ని, తాను ఎదుర్కొన్న సవాళ్లను, ఇబ్బందులను, తీసుకున్న అసాధారణ నిర్ణయాలు, చర్యల గురించి ఏకరువు పెట్టారు. ఒకరకంగా గుర్తు చేసుకున్నారు. వెనక్కి తీరిగి చూసుకుంటే ఇన్నేళ్లు పూర్తి చేశానా అన్న అనుమానం ఉందన్నారు. కానీ ఆ దైవ బలం తనకు మరింత శక్తని ఇచ్చేలా చేసిందన్నారు మోదీ. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సమర్థవంతుడైన నాయకుడిగా పేరు పొందారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. తను సుదీర్ఘ కాలం పాటు పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు గాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీ 25 ఏల్ల పాలన నాయకత్వానికి నమూనా అని పేర్కొన్నారు.






