తిరుపతిలో బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారి
తిరుపతి : తిరుపతి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సోమవారం శివశంకర్ లోతేటి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిని ప్రధాన కార్యాలయానికి ఆయన తన కుటుంబంతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఉద్యోగులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. శివ శంకర్ లోతేటి కార్యాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎండీగా, చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా కీలక పదవులు చేపట్టారు గతంలో. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లను బదిలీ చేసింది. మరికొందరికి కీలక పోస్టులు అప్పగించింది. మరో వైపు ఎవరూ ఊహించని రీతిలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ కు రెండోసారి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా బాధ్యతలు అప్పగించింది.
మరో వైపు నిక్కచ్చి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న కేఎస్ విశ్వనాథన్ ను విశాఖ నుంచి మార్చేశారు. ఆయన ఇవాళ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక శివ శంకర్ లోతేటి విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పరిపాలనకు ఇచ్చిన ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రారంభమైన తన కేడర్ కేటాయింపుపై చాలా కాలంగా కొనసాగుతున్న చట్టపరమైన వివాదాన్ని ఈ నిర్ణయం ముగించింది. లోతేటి స్వస్థలం ఏపీలోని విజయనగరం. రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్నప్పుడు ఆయన యుపిఎస్‌సికి అందించిన తాత్కాలిక చిరునామా ఆధారంగా ఈ కేటాయింపు జరిగింది.
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) నిరంతరం ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది, ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి కేటాయించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT)ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసి, CAT ఆదేశాన్ని సమర్థించింది.






