మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
ఢిల్లీ : తమిళనాడులో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ ఘటనకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. టీవీకే పార్టీ విజయ్ ను ఏకి పారేసింది. ఎందుకు తనపై కేసు నమోదు చేయలేదంటూ ప్రశ్నించింది. ఇదే సమయంలో కరూర్ ఘటనపై సిట్ ను ఏర్పాటు చేయాలని తమిళనాడు డీఎంకే ప్రభుత్వాన్ని, సీఎంను ఆదేశించింది. ఇదిలా ఉండగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టింది జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియా ఆధ్వర్యంలోని ధర్మాసనం . ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది.
రిటైర్డ్ న్యాయమూర్తి రస్తోగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. తీర్పు సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం కమిటీ దాని స్వంత విధానాన్ని రూపొందించు కోవాలని ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు నెలవారీ నివేదికను ప్యానెల్ ముందు సమర్పించాలని CBIని ఆదేశించింది . తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు రెండు విరుద్ధమైన ఆదేశాలను జారీ చేయడాన్ని తప్పు పట్టింది.






