విశాఖ సీఐఐ సదస్సుకు హాజరు కావాలి
ఢిల్లీ : న్యూఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నివాసంలో తనను కలుసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. వీరిద్దరి భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ఈనెల 16న ఏపీలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి. తన టూర్ లో భాగంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కర్నూల్ లో ఏపీ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ పేరుతో నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. అనతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా వచ్చే నవంబర్ 14, 15వ తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం విశాఖ నగరం వేదికగా సీఐఐ సదస్సు నిర్వహించనుంది. ఇప్పటి నుంచే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతే కాకుండా ఈ సదస్సుకు మీరే అధ్యక్షత వహించాలని కూడా కోరారు.
కాగా పీఎం పర్యటనతో నంద్యాల జిల్లా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు.






