ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా ఉండాలి
అమరావతి : శ్రీశైలం అభివృద్దికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాస్టర్ ప్లాన్ పై మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, ఇరు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.
సమావేశంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ హరి జవహర్‌లాల్, దేవాదాయశాఖ కమిషనర్ రామ చంద్ర మోహన్ , పీసీసీఎఫ్ శ్రీ చలపతి రావు , అదనపు పీసీసీఎఫ్ శాంతి ప్రియ పాండే హాజరయ్యారు. యుద్ద ప్రాతిపదికన ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఇదిలా ఉండగా ఈనెల 16న దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ సమయంలో కీలక సమవేశం నిర్వహించడం విశేషం.






