విశాఖ‌ను ఐటీ హ‌బ్ గా మారుస్తాం : సీఎం

Spread the love

ఏపీ ప్ర‌భుత్వంతో గూగుల్ కంపెనీ ఒప్పందం

ఢిల్లీ : విశాఖ‌ను ఐటీ హ‌బ్ గా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీలో గూగుల్ కంపెనీతో ఏపీ స‌ర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి గూగుల్ ప్ర‌తినిధుల‌తో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణ‌వ్, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ , నిర్మ‌లా సీతారామ‌న్ తో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను కూడా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. ఆనాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చామ‌ని, ఇప్పుడు విశాఖ న‌గ‌రానికి గూగుల్‌ను తీసుకొస్తున్నామని అన్నారు. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని తెలిపారు. డిజిటల్‌ కనెక్టివిటీ, డేటా సెంటర్‌, ఏఐ, రియల్‌టైమ్‌ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవని అన్నారు.

సాంకేతికను అందిపుచ్చు కోవడంలో తమ రాష్ట్రం ముందంజ‌లో ఉంటుంద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ మనందరి లక్ష్యమని వెల్లడించారు. హార్డ్‌ వర్క్‌ కాదు, స్మార్ట్‌ వర్క్‌ నినాదం తీసుకొచ్చామని చెప్పారు సీఎం. ఐదేళ్లలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడతామనడం సంతోషంగా ఉంద‌న్నారు. విశాఖ‌కు గూగుల్ తీసుకు రావ‌డంలో ప్ర‌ధాని మోదీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఈసంద‌ర్బంగా ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఏపీ, గూగుల్‌కే కాదు. భారత్‌కు కూడా ఇదొక చరిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌.

  • Related Posts

    గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

    Spread the love

    Spread the loveఅంద‌జేస్తామ‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల స‌ర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు…

    డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

    Spread the love

    Spread the loveతెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌ హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *