రూ. 40 లక్షల చెక్కు కూడా ఇచ్చిన బాస్
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాగంటి సునీతా గోపీనాథ్ కు బి – ఫామ్ అందజేశారు. దీంతో పాటు ఎన్నికల ఖర్చు కోసం బీఆర్ఎస్ తరపున రూ. 40 లక్షల చెక్కును కూడా స్వయంగా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమెను దీవించారు. తనకు బి ఫామ్ ఇస్తున్న సమయంలో మాగంటి సునీత తన భర్త మాగంటి రవీంద్రనాథ్ ను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవలే ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఏరికోరి తననే ఎంపిక చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున పలు క్రిమినల్ కేసులు ఉన్న నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది.
మరో వైపు ప్రచారం ఊపందుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మాగంటి సునీతను ఎలాగైనా గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావులతో పాటు , బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే దొంగ ఓట్ల నమోదుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ .






