పార్టీ పెద్ద‌ల‌కే వ‌దిలేశా : కొండా సురేఖ‌

క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్లే ఇదంతా

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ కాంగ్రెస్ రాజ‌కీయం మ‌రింత వేడిని రాజేసింది. ఆధిప‌త్య పోరుకు తెర లేపింది. ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కొండా సురేఖ‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా చేరుకుంది. ప్ర‌ధానంగా స‌మ్మ‌క్క సార‌క్క‌ల టెండ‌ర్ల విష‌యంలో చోటు చేసుకున్న రూ. 71 కోట్ల టెండ‌ర్ లో త‌న మ‌నుషుల‌కు ఇప్పించ్చు కున్నారంటూ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా ప‌టేల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డిని, ఆయ‌న సోద‌రులు కొండ‌ల్ రెడ్డి, తిరుప‌తి రెడ్డిల‌ను టార్గెట్ చేశారు. ఎలాంటి ప‌ద‌వులు లేని వారికి గ‌న్ మెన్లు ఎందుకంటూ ప్ర‌శ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ గా మారాయి.

దీనిపై వెంట‌నే త‌మ వ‌ద్ద‌కు రావాలంటూ ఫోన్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్. దీంతో హుటా హుటిన ఆమె క్వార్ట‌ర్స్ చేరుకున్నారు మంత్రి కొండా సురేఖ‌, కూతురు సుష్మిత‌.
ఈ సంద‌ర్బంగా సుదీర్ఘంగా చ‌ర్చించారు. భేటీ అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ పిసిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపాన‌ని చెప్పారు. ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తాం అని హామీని ఇచ్చారన్నారు. పార్టీ పెద్దలు సెటిల్ చేస్తామ‌ని పేర్కొన్నారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నాన‌ని చెప్పారు కొండా సురేఖ‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *