పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ
హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై జరిగిన షూ దాడి దేశంలోని దళిత ప్రజలందరిపై జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ఇది దేశ ప్రజాస్వామిక విలువలపై, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి జరిగినట్లే అని అన్నారు. దాడి జరిగిన రోజు ఖండనలకు మాత్రమే పరిమితమై వివిధ పార్టీల అగ్ర నాయకులు, సంఘాల నాయకులు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదుకు గాని కఠిన చర్యలకు గాని దేశంలో ఎవరూ కార్యాచరణ ప్రకటించ లేదన్నారు. పోరాటం చేయడం లేదని మండిపడ్డారు.
కానీ దళిత జాతికి ఆత్మ గౌరవం ఎక్కడ ఆటంకం జరిగినా ఈ దేశంలో పోరాడిన చరిత్ర ఎమ్మార్పీఎస్ ది అని స్పష్టం చేశారు మందకృష్ణ మాదిగ. MRPS ఉద్యమం పురుడు పోసుకోక ముందు నుండే దళితుల ఆత్మ గౌరవం విషయంలో పోరాడిన చరిత్ర ఉందన్నారు. ఎదుర్కొన్న సంఘటనలను అదేవిధంగా వర్గీకరణకై పోరాడుతూనే ఉందన్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి శంకర్ రావు, గీతారెడ్డి, రాజస్థాన్ లోని ఇంద్ర కుమార్ మేఘ్వాల్, ప్రణయ్ హత్య తో పాటు ఆత్మ గౌరవానికి ఆటంకం కలిగిన ప్రతిసారి ఉద్యమంచామని , ఖండించామని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టామన్నారు.
CJI గవాయ్ పై దాడి చేసిన రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, దాడి కుట్ర వెనుక ఉన్న ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ. దళిత జాతి ఆత్మ గౌరవ పోరాటాలు ఏ విధంగా ఉంటాయో ప్రపంచానికి చాటి చెబుదాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రంలో ఉన్న హాస్టల్స్, కళాశాలల నుండి మాదిగ విద్యార్థులు దళితుల ఆత్మ గౌరవ మహ ర్యాలీకి వేలాదిగా కదలి రావాలి అని పిలుపునిచ్చారు.






