ప్రమోద్‌ కుటుంబానికి అండగా ఉంటాం

Spread the love

నిజామాబాద్‌ కాల్పులపై డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై స్పందించారు. వాహ‌నం చోరీ చేస్తున్న స‌మ‌యంలో ప‌ట్టుకోబోయిన కానిస్టేబుల్ ప్ర‌మోద్ పై నిందితుడు షేక్ రియాజ్ దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో త‌ను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇవాళ పోలీసులు త‌నను అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా మ‌రోసారి క‌త్తితో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ ఎన్ కౌంట‌ర్ లో రియాజ్ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కీల‌క అప్ డేట్ ఇచ్చాడు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి.

ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్ర‌మోద్ కు పోలీస్ శాఖ త‌ర‌పున ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నామ‌ని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఎలాంటి నేరస్తులను అయినా కఠినంగా అణచి వేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు డీజీపీ. ప్రమోద్‌ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామ‌న్నారు. ప్రమోద్‌ పదవీ విరమణ వరకు వచ్చే సాలరీ అందిస్తామ‌న్నారు . 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామ‌న్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని రేపు జ‌రిగే అమ‌ర వీరుల స‌భ‌లో సీఎం ప్ర‌క‌టిస్తార‌ని చెప్పారు డీజీపీ.

  • Related Posts

    ఆరు నూరైనా పాల‌మూరును అభివృద్ది చేస్తా

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల‌మూరు జిల్లా : ఆరు నూరైనా పాల‌మూరును అభివృద్ది చేసి తీరుతానంటూ ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లి లో…

    బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీపీసీసీ నేత జ‌గ్గారెడ్డి హైద‌రాబాద్ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నంటూ ప్ర‌క‌టించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *