కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ కు ఎంఐఎం స‌పోర్ట్

గెలిపించాల‌ని కోరిన పార్టీ చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ

హైద‌రాబాద్ : ఎంఐఎం పార్టీ చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న బీఆర్ఎస్ ను విమ‌ర్శించారు. గ‌త 10 ఏళ్ల కాలంలో జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది గురించి ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. ద‌య‌చేసి ఓట‌ర్లు ఆలోచించి ఓటు వేయాల‌ని, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. ఎంఐఎం పార్టీ బేష‌ర‌తుగా న‌వీన్ కు అండ‌గా ఉంటాని ప్ర‌క‌టించారు. ఒక‌వేళ బీఆర్ఎస్ గెలిస్తే ఏం లాభం అని ప్ర‌శ్నించారు. ఏం అభివృద్ది చేశారో ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం అస‌దుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు . ప్ర‌స్తుతం రాబోయే ఫలితం ప్రస్తుత ప్రభుత్వాన్ని తయారు చేయదు లేదా విచ్ఛిన్నం చేయదని అన్నారు. ఈ విష‌యాన్ని ఓట‌ర్లు గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు ఓవైసీ.

న‌వీన్ యాదవ్ ఆధ్వర్యంలో అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని ఆయన అన్నారు. తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో AIMIM వేరే వ్యూహాన్ని అనుసరించవచ్చని కూడా ఆయన సూచించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యంత ప్రతిష్ఠాత్మక ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. ఈ ఏడాది జూన్‌లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బిఆర్‌ఎస్ గోపీనాథ్ భార్య మాగంటి సునీతను పోటీకి దించగా, బిజెపి లంకాల దీపక్ రెడ్డిని నామినేట్ చేసింది.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *