ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా కీల‌కం

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు

న్యూఢిల్లీ : కేంద్ర విమానాయ‌న శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా టాప్ లో కొన‌సాగ‌డం ఖాయ‌మ‌న్నారు. యు.ఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) 50వ వార్షికోత్సవ ప్రత్యేక సమ్మిట్ సందర్భంగా న్యూ ఢిల్లీలో నిర్వహించిన USIBC బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. భారత్, అమెరికా దేశాల మధ్య ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, ఆవిష్కర్తలు, ఆలోచనాపరులను ఒక వేదిక పైకి తీసుకువచ్చి ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో USIBC కీలక పాత్ర పోషిస్తోందని ప్ర‌శంస‌లు కురిపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థిక రంగంలో కొత్త దశలోకి అడుగు పెట్టిందని చెప్పారు. భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో విమానయాన రంగం కీలక స్థానం దక్కించు కుంటోందని తెలిపారు. అధునాతన సాంకేతికత, విలువైన ప్రాజెక్టుల కోసం ప్రముఖ OEM సంస్థలకు భారత్ విశ్వసనీయ భాగస్వామిగా మారుతోందని చెప్పారు కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు. ఇవాళ టెక్నాల‌జీ రంగంలోనే కాదు ఇత‌ర రంగాల‌లో భార‌త దేశం కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంద‌ని అన్నారు.

  • Related Posts

    ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌ర్చేందుకు ‘ఏఐ’ వినియోగం

    అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమయ్యారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆదాయ వనరుల గండిని పూడ్చడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం…

    వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *